30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ బాహుబ‌లి ఇంటి ఎదుట జ‌పాన్ ఫ్యాన్స్ డ్యాన్స్…

బాహుబ‌లి ఇంటి ఎదుట జ‌పాన్ ఫ్యాన్స్ డ్యాన్స్…

- Advertisement -

హైద‌రాబాద్ః బాహుబలి సినిమాతో ప్రభాస్ యూనివర్సల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రభాస్ కి లక్షల అభిమానులను సంపాదించి పెట్టింది. ఈ సినిమా జపాన్ లో కూడా విడుదలైంది. అక్కడ కూడా ప్రభాస్ కి చాలామంది అభిమానులు అయ్యారు. ఇందులో అమ్మాయిల సంఖ్యే ఎక్కువ.

చ‌ద‌వండిః పవన్ అంతరంగాన్ని ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు: జేడీ చక్రవర్తి

బాహుబలి సినిమా జపాన్ లో విడుదలైన తర్వాత బాహుబలి చిత్ర బృందం జపాన్ కు వెళ్ళింది. అక్కడి అభిమానులు ఎంతో అభిమానంతో చాలా బహుమతులు ఇచ్చారు. అందులో లో చాలామట్టుకు స్వతహాగా తయారు చేసినవే.

అయితే ఇటీవల జపాన్ నుంచి ప్రభాస్ అభిమానులు ఇండియాకు వచ్చారు. వారంతా ప్రభాస్ పై ఉన్న అభిమానంతో ఆయనను కలుసుకునేందుకు హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటికి వెళ్లారు. కానీ ప్రభాస్ తన నూతన చిత్రమైన సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నందున వారిని కలుసుకోలేక పోయారు.

అందుకు వారు నొచ్చుకోకుండా ప్రభాస్ ఇంటి ముందు నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -