26.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ గాయాల నుంచి కోలుకుని సెట్స్ లో అడుగుపెట్టిన గోపీచంద్!

గాయాల నుంచి కోలుకుని సెట్స్ లో అడుగుపెట్టిన గోపీచంద్!

gopichandh
- Advertisement -

హైదరాబాద్: తెలుగు తెరపై యాక్షన్ హీరోగా ఎక్కువ మార్కులు కొట్టేసిన హీరో గోపీచంద్. అయన ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గోపీచంద్ సినిమాలంటే మాస్ ఆడియన్స్ కి పండుగే అని చెప్పాలి.

అందువల్లనే తన సినిమాల్లో అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉండేలా గోపీచంద్ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, కొంతకాలం వెయిట్ చేసి మరీ ఆయన దర్శకుడు తిరు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అనిల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గోపీచంద్ గాయపడ్డాడు. ఈ కారణంగా ఆ షెడ్యూల్ షూటింగును ఆపేశారు. ఆ గాయాలు నయమై గోపీచంద్ కోలుకున్నాడనేది తాజా సమాచారం.

ఈ సినిమా షూటింగులో తిరిగి పాల్గొనేందుకు గోపీచంద్ సిద్ధమవుతున్నాడట. డిఫరెంట్ లుక్ తో గోపీచంద్ కనిపంచనున్న ఈ సినిమా, ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

- Advertisement -