25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మన చంద్రన్నది చేనేత కుటుంబమే: కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి

మన చంద్రన్నది చేనేత కుటుంబమే: కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి

Chandrababu Latest News, Vavilala Sarala Devi Latest News, TDP News, Newsxpressonline
- Advertisement -

తణుకులో భారీ సభ

వావిళాల సరళాదేవి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరిన చేనేత మహిళలు,

యువత ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రాథాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా

తణుకు: వర్షాకాలంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2వేలు చొప్పున రెండు నెలలకు రూ.4వేలు భృతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, ఎన్నికల కోడ్ కారణంగా అది అమలు కాలేదని, ఇలా ఎన్నికలు పూర్తయి మళ్లీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రికాగానే తక్షణం అమలులోకి వస్తుందని చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి పేర్కొన్నారు.

తణుకు పట్టణంలో ఆమె ఆధ్వర్యంలో జరిగిన చేనేత కులాల సభలో మాట్లాడుతూ చేనేత కార్మికులకు, కులాలకు ఎన్నో పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాటిలో ముఖ్యంగా 50ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు పెన్షను ఇచ్చినట్టే, ఆ ఇంట్లో మహిళామణులు కూడా ఇంటిపెద్దతో సమానంగా మగ్గం నేస్తుంటారు, అదే సమయంలో ఇంటిపని మొత్తం చక్కబెట్టు కుంటారు..అందుకని ఒకే కుటుంబంలో ఉన్న వారిద్దరికి పెన్షను ఇప్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నామని, అది తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

Chandrababu Latest News, Vavilala Sarala Devi Latest News, TDP News, NewsxpressonlineChandrababu Latest News, Vavilala Sarala Devi Latest News, TDP News, Newsxpressonline
కష్టపడే మహిళలంటే ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం

నిజంగా ముఖ్యమంత్రి గారికి మహిళలంటే ప్రత్యేక గౌరవం, అందునా కష్టపడి పనిచేసేవారంటే మరింత అభిమానిస్తారని..అందుకే తప్పకుండా ఇచ్చిన హామీ నెరవేర్చుతారని ఈ సందర్భంగా సరళాదేవి పేర్కొన్నారు. ఇంకా చేనేత కుటుంబాలకు ఆదరణ పథకం లాంటివి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపోతే మనకు చేనేత కార్పొరేషన్ వచ్చిందని.. ఏమైనా సమస్యలుంటే..ఆ కార్పొరేషన్ ద్వారా పనులు చకచకా అయిపోతాయని వివరించారు. అక్కడ ఒక జవాబుదారీతనం ఉంటుందని తెలిపారు. నిత్యం ఒక వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి మాట..ఇక నుంచి నాదీ చేనేత కుటుంబమే..

ఆ చేనేత కార్పొరేషన్ ఏర్పాటుచేయగానే..మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నమాటేమిటంటే..ఇక నుంచి నాదీ చేనేత కుటుంబమేనని తెలిపారు.ఆనాడు గాంధీజీ నిత్యం నూలు వడికే రాట్నంకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారంటే.. ఆ చేనేత వస్త్రాలకి ఉన్న ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి మాటగా వివరించారు.

ఆరోజుల్లో స్వాతంత్ర్యపోరాటంలో..

వీదేశీ వస్తు బహిష్కరణ కార్యక్రమం సందర్భంగా గాంధీగారిచ్చిన పిలుపు మేరకు..అందరూ స్వదేశీ వస్తువులే వాడటం  మొదలుపెట్టారు. ఆ ప్రకారంగా  ఆడామగా,చిన్నాపెద్దా అందరూ  దేశం దేశమంతా ఖద్దరు దుస్తులు, నేత చీరలనే వాడారని తెలిపారని వివరించారు. అదెప్పుడూ ప్రజలకు గుర్తుండాలని, ఆ నేతన్నకు అండగా గాంధీజీ నిలిచి..మన చేనేతకు ఒక బ్రాండ్ అంబాసిడార్ గా నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారని వివరించారు.

అందుకే అటు అభివృద్ధిలో భాగంగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు,  ఇటు ప్రజాసంక్షేమం కోసం ఎన్నో పథకాలు.. ఇలా రెండింటినీ చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబును గెలిపించాలని ఈ సందర్భంగా సరళాదేవి కోరారు.

చేనేత మహిళామణులు, యువత తెలుగుదేశం పార్టీలో చేరిక

తణుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందమందికి పైగా చేనేత కుటుంబాల నుంచి మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే యువత కూడా అధికసంఖ్యలో పార్టీలో చేరారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ఎ.రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వైటీరాజాలు వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ..

ఆంధ్రరాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కష్టాన్ని చూసి ప్రజలందరూ ఓటేయాలని తెలిపారు. అవతల వైసీపీ నుంచి అధికారం కోసం అర్థం లేని హామీలన్నీ ఇచ్చి ప్రజలను పక్కదారిపట్టిస్తున్న వారి మాటలను నమ్మవద్దని తెలిపారు. ఇప్పటికే ఎన్నో కేసుల్లో ఉన్న వ్యక్తులకు ఓట్లు వేస్తే..వాళ్లు ఆ కేసుల నుంచి బయటపడటానికి అధికారాన్ని వాడుకుంటారు గానీ ప్రజల కోసం కాదని వివరించారు. ఈ కార్యక్రమంలో వావిలాల వెంకట రమేష్, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -