23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘రంగస్థలం’లో రామలక్ష్మికి ఫస్ట్ ఆప్షన్ సమంత కాదు: సుకుమార్

‘రంగస్థలం’లో రామలక్ష్మికి ఫస్ట్ ఆప్షన్ సమంత కాదు: సుకుమార్

Rangastalam Movie Latest News, Samantha News, Sukumar Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. సుకుమార్, రాం చరణ్ మొదటిసారి కలిసి చేసిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. రామలక్ష్మి పాత్రలో సమంత మరోసారి తన సత్తా చాటింది.

అయితే డైరక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకోలేదట. సమంతకు ఆల్రెడీ పెళ్లైంది కాబట్టి ఆమె కాకుండా వేరే హీరోయిన్ అనుకున్నారట. అంతేకాదు ఇద్దరు స్టార్స్ ను తను హ్యాండిల్ చేయడం కష్టమని భావించాడట. కాని ఫైనల్ గా సమంతనే రామలక్ష్మి పాత్ర చేసింది.

చదవండి: అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో హన్సిక!

సినిమాలో చిట్టిబాబు నటనతో పాటుగా రామలక్ష్మిగా సమంత చించేసింది. సినిమా హిట్టైన తర్వాత సుకుమార్ తాను సమంత విషయంలో తప్పుగా ఆలోచించానని అనుకున్నాడట. ఆమె చేయగలదా? లేదా? అనుకున్న ప్రతిసారీ తను చేసే సీన్స్‌తో ఫట్ ఫట్ మని చెంప చెళ్లుమనిపించిందని అన్నారు సుకుమార్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం సినిమాలో సమంత పాత్రకు ఆమె తప్ప మరెవరు అంత న్యాయం చేయలేరని అన్నాడు సుకుమార్. ప్రస్తుతం మహేష్‌తో మూవీ క్యాన్సిల్ అవగా అల్లు అర్జున్ 20వ సినిమా సుకుమార్ డైరక్షన్‌లో ఉంటుందని తెలుస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఆ సినిమా ఎలా ఉంటుందో మరి.

చదవండి: బిగ్‌బాస్-3 పార్టిసిపెంట్‌గా యాంకర్ ఉదయభాను.. కళ్లు చెదిరే పారితోషికం!
- Advertisement -