యాత్ర సినిమాపై మెగా డైరెక్టర్ హాట్ కామెంట్స్ !

DIrector-Surender-Reddy, newsxpress.online

హైదరాబాద్ :మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం యాత్ర. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వై ఎస్ గ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అదరగొట్టేసాడు. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరు కూడా ఆ రాజన్న ని మళ్ళీ గుర్తు చేసారు అని చెప్పడం వింటుంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా ఉందొ.

రాజశేఖర్ రెడ్డి జీవితం లో కీలకఘట్టం అయిన పాదయాత్రని కథగా మలిచి డైరెక్టర్ మహి వి అద్భుతంగ తెరకెక్కించాడు. ఇక పొతే ఇప్పటికే ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ కూడా సినిమాని చూసి తమ తమ స్పందన ఏమిటో తెలియజేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ అందుకుంటోంది.

మమ్ముట్టి గారి నటన అద్భుతం…

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. యాత్రను అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర యూనిట్ ను అభినందించారు. సోమవారం సురేందర్ రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ యాత్ర సినిమాను చూశాను. ఇది నిజంగా ఎమోషనల్ జర్నీనే.

చాలా సీన్లలో భావోద్వేగానికి లోనయ్యా. ఈ సినిమాలో మమ్ముట్టి గారి నటన అద్భుతంగా ఉంది. ఎంతలా అంటే రాజన్నే స్వయంగా స్క్రీన్ మీద ఉన్నారా? అని నాకు అనిపించింది. ఇలాంటి అద్భుతాన్ని తెరకెక్కించిన యాత్ర తారాగణం మరియు సిబ్బందికి నా అభినందనలు అని ట్వీట్ చేశారు.

చదవండి: మమ్ముట్టిలో వైఎస్సే కనిపించారు: ‘యాత్ర’ మూవీపై కొడాలినాని స్పందన!