మళ్లీ బాలయ్య-బోయపాటి కాంబినేషన్.. ఈసారి ముఖ్యమంత్రిగా ‘లెజెండ్’

- Advertisement -

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ-స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ మరో అద్భుతమైన సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ భోగట్టా. ఈసారి బాలయ్యను ముఖ్యమంత్రిగా చూపించాలని బోయపాటి ఫిక్సయ్యాడట. ఇందుకోసం పవర్‌ఫుల్ కథను కూడా సిద్ధం చేసుకున్నాడని, సింహా, లెజెండ్ తరహాలోనే ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని చెబుతున్నారు.

బోయపాటి గత చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా కూడా ఉంటుందట. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూడో సినిమా బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతికి వచ్చిన బాలయ్య ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’, బోయపాటి డైరెక్షన్‌లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ రెండూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో మంచి హిట్ కోసం ఇద్దరూ ఎదురుచూస్తున్నారు.

‘మహానాయకుడు’ విడుదల తర్వాతే ముహూర్తం…

ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి చిత్రం ‘మహానాయకుడు’ విడుదల తర్వాత కొత్త చిత్రాన్ని బోయపాటి పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక, లొకేషన్స్ ఎంపిక లాంటి ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -