
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య , అక్కినేని సమంత నాయకా నాయికలుగా నటించిన తాజాచిత్రం మజిలీ. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.
దాంతో విడుదలకి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సమంత, చైతూ పెళ్లి తరువాత వస్తోన్న తొలి సినిమా కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కావాలని ఈ జంట కోరుకుంటోంది.
ఈ కోరిక నెరవేర్చమని స్వామిని కోరుకోవడానికే సమంత తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ప్రేమ , పెళ్లి , ఆశయం అనే మూడు బలమైన కోణాల్లో ఈ సినిమా కథ కొనసాగుతుంది.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి ఎటువంటి పోటీ లేదు. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా బంపర్ హిట్ ఖాయం.








