
హైదరాబాద్: శర్వానంద్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన కూడా ఈ మధ్య కాలంలో హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
డ్యూయల్ రోల్ లో మెప్పిస్తాడా…
శర్వానంద్ పుట్టినరోజు(మార్చ్ 6) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న గెటప్స్ లో కన్పిస్తాడనే సంగతి తెలిసిందే. అందులో ఒకటి యంగ్ లుక్ కాగా మరొకటి సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్ గెటప్ లో కనిపించే ఏజ్డ్ లుక్. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లా కనపడడం లేదు కానీ ఫుల్ గడ్డం లుక్ లో ఉన్నాడు.

స్టైలిష్ సూటు తో పాటుగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని సీరియస్ డాన్ లాగా ఉన్నాడు. పెయింటింగ్ లాగా డిజైన్ చేసిన పోస్టర్ లోనే “హ్యాపీ బర్త్ డే శర్వా27” అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అతి త్వరలో ఈ సినిమా టైటిల్ కూడా వెల్లడిస్తారట.
ఈమధ్యే స్పెయిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతున్నారు. మేలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ ఆగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై.
చదవండి: సినీ ఇండస్ట్రీలో సంచలనం! రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్న మహేష్!








