
- Advertisement -
- Advertisement -

హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో రూపొందనుంది. కథా పరంగా ఈ సినిమా షూటింగు అమెరికాలో జరగనుంది. అంతా రెడీగా ఉన్నప్పటికీ అనుష్కకి వీసా రాకపోవడం వలన ఆలస్యమైంది.
తాజాగా అనుష్కకి వీసా రావడంతో, త్వరలో అమెరికా వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ తో పాటు మాధవన్ అంజలి షాలినీ పాండే నటించనున్నారు.