
- Advertisement -
హైదరాబాద్: స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ – త్రివిక్రమ్ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది. సోమవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన చేసింది హారిక అండ్ హాసిని.
ఈనెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు వెల్లడించింది. గతంలో వీళ్లిద్దరు కాంబో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టడంతో న్యూ ప్రాజెక్టుపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి.
అల్లు అర్జున్‌కి ఇది 19వ మూవీ. మరోసారి బన్నీ సరసన పూజాహెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసిని-గీతా ఆర్ట్స్ దీన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు.
https://twitter.com/haarikahassine/status/1115198245024571392
- Advertisement -








