22.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

- Advertisement -

అమరావతి: వైసీపీ నేత, సినీ నటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి అండగా ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని ప్రశ్నించారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని, ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు.

రాజమండ్రిలో రోడ్ షో లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైయస్సార్ శవం కూడా దొరక్కముందే సీఎం అయ్యేందుకు జగన్ ప్రయత్నించారని, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని పవన్ ప్రశ్నించారు. వైయస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని తనను బెదిరించారని… బెదిరిస్తే తోలు తీస్తానని హెచ్చరించారు.

అలీ వైసీపీలో చేరడంపై గతంలో పవన్ తన అభిప్రాయాన్ని మీడియాకు తెలిపారు. జగన్ బలమైన నాయకుడని అలీ భావించాడు కాబట్టే వైసీపీలో చేరి ఉంటాడని వ్యాఖ్యానించారు. అలీ జనసేనలో చేరాలనే నియమమం లేదన్నారు. అలీకి కూడా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయని, ప్రత్యేకంగా ఆయనకు ఓ నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. తానెప్పుడు స్టార్ పవర్‌ను నమ్ముకోలేదని, అలీ వేరే పార్టీలో చేరినంత మాత్రాన తనకేం నష్టం జరగదని పవన్ అన్నారు.

- Advertisement -