
హైదరాబాద్: ఒక ప్రభుత్వ అధికారి సమర్థవంతంగా పనిచేస్తే చాలా సమస్యలు తీరిపోతాయి. కానీ వారికి అడుగడునా రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుంటాయి.
మరికొందరు స్వతహాగానే అవినీతపరులై ఉంటారు. కానీ ప్రజలకు మేలు చేయాలనుకునే ఓ నిజాయితీ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు.
వారిని ఎదిరించి ప్రజలకు ఎంత గొప్పగా సర్వీస్ చేశాడు అనే కథాంశంతో వస్తున్న సినిమా ‘ఐఏఎస్ అధికారి’(వర్కింగ్ టైటిల్).
నేటి సమకాలీన రాజకీయాలపై సెటైరికల్ గానూ రూపొందబోతోన్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిపోయింది.
అత్యంత పవర్ ఫుల్ కథాంశంతో రాబోతున్న ఈ కథ అద్భుతంగా వచ్చిందనని చెబుతున్నాడు హీరో సత్యసుమన్ బాబు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. పరిశ్రమలోని ప్రతిభావంతమైన సీనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించబోతున్నారు.
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందబోతోన్న ఈ చిత్రానికి స్వీయదర్శకత్వంలో సిహెచ్. సత్యసుమన్ బాబు రూపొందిస్తూ హీరోగా నటిస్తున్నాడు.
ఆయన సరసన ప్రముఖ హీరోయిన్ నటించబోతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోన్న ఈ చిత్రానికి కథ, మాటలు బాలకిశోర్.








