జగన్ సీఎం అయ్యాక ఏపీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు: రోజా

- Advertisement -

అమరావతి: ఏపీఐఐసీ చైర్మన్, వైపీపీ ఎమ్మెల్యే రోజా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ 100 రోజుల పాలన, పల్నాడు పరిస్థితులపై రోజా స్పందించారు.

చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రోజా అన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు.

సీఎం జగన్ 100 రోజుల పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రోజా చెప్పారు. సీఎం జగన్‌ సుపరిపాలనను ఓర్వలేకే చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయిస్తున్నారని, బురజజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గుంటూరు జిల్లాకి చెందిన టీడీపీ నేతలపై రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారని రోజా అన్నారు.

కోడెల, యరపతినేని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, బోండా ఉమా బాధితుల కోసం చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు. పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇకనైనా నాటకాలు ఆపకపోతే ప్రజలు తరిమికొడతారని చంద్రబాబుని హెచ్చరించారు

- Advertisement -