‘తేజ్‌ ఐ లవ్‌ యు’ మూవీ రివ్యూ

tej-movie
- Advertisement -

tej-i-love-you

‘తొలి ప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన మీ మీద భారీ అంచనాలు ఉంటాయి…
ఆబియస్ గా …
అలాంటి మీరు ఆ సినిమాని మర్చిపోయే సినిమా తీయాలి…
అసలు నన్నే మర్చిపోయే .. సారీ థియేటర్‌లో సినిమా చూసే వాళ్లు తాము సినిమా చూస్తున్నామనే విషయమే మర్చిపోయే సినిమా తీస్తా..
వెరీ గుడ్ ..మరి కథ అనుకున్నారా?
మొన్న రాత్రి వసంత కోకిల చూసా..
క్లైమాక్స్ అదిరిపోతుంది..ఇన్నేళ్లయినా నాకు గుర్తుంది.. శ్రీదేవి తనను మర్చిపోయి వెళుతుంటే… కమల్ ఇచ్చే ఎక్సప్రెషన్స్..
ఆ కొద్ది సేపు క్లైమాక్స్ కే మీరు ఇన్నేళ్లు గుర్తు పెట్టుకున్నారే… అదే మెమరబుల్  పాయింట్ ని డెవలప్  చేసి స్క్రిప్టు చేశా.. తరతరాలు మర్చిపోరు…
అయితే కమల్ రీమేక్ చేసే స్థాయి సినిమా ఇస్తున్నారన్నమాట..
సారీ.. కమల్ కూతురు చేస్తానంటేనే రైట్స్ ఇద్దాం.. ఆయన పెద్దాయన అయిపోతారు.. ఓకే .. తమిళ రైట్స్ అమ్మేటప్పుడు మీ సజెషన్ గుర్తు పెట్టుకుంటా…

ఈ సినిమా ప్రారంభానికి ముందు ఇలాంటి సంభాషణలు జరిగాయి అనిపించే ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది. మరి అసలు ఈ వసంత కోకిల కు కరుణాకరన్ ఈ కొత్త లవ్ కహానీకి లింకేంటి..అసలు సినిమా ఎలా ఉంది.. వంటి విషయాలు చూద్దాం…

స్టోరీ లైన్ ఇదే…

‘క్రేజీ బాయిస్’ అనే రాక్ బ్యాండ్ లో పనిచేస్తూ జీవితం హ్యాపీగా గడుపుతున్న తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌) జీవితంలోకి ఓ ఎన్నారై అమ్మాయి నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌)  ప్రవేశిస్తుంది. పరిచయం ప్రేమగా మారి..ఇద్దరూ ఒకరికొకరు వ్యక్తం చేసుకునే సమయంలో ..ఆమెకు యాక్సిడెంట్ అయ్యి..మెమరి లాస్ అయిపోతుంది. తేజ్ ని అతని ప్రేమను మర్చిపోతుంది. అప్పుడు తేజ్ , తన  ప్రెండ్స్ సహకారంతో ఏం చేసి తిరిగి తన ప్రేమను గుర్తు చేసి తనదాన్ని చేసుకున్నాడనేది కథ.

ఈ కథ తెరపై ఎలా ఉందంటే…

ఇలాంటి కథలు తెలుగు తెరకే కాదు ప్రపంచ తెరకు కూడా కొత్తేం కాదు. కానీ మరి కుర్రాడైన సాయి ధరమ్ తేజను , సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు ని ఏం చెప్పి ఒప్పించారో అర్దం కాదు.

ఈ స్టోరీ లైన్ వినటానికి బాగానే ఉన్నా…రాబోయే పదోసీన్ ఏంటో చెప్పగలిగే స్దాయిలో చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపించటమే దెబ్బ కొట్టింది. కరుణాకరన్ ఫీల్డ్ లోకి ప్రవేశించేనాటికి ఇది చాలా ఫ్రెష్ కథ అయ్యిండవచ్చు. కానీ ఈ తరానికి  మెమిరీ లాస్ కథలను గజనీ వచ్చి ఫుల్ స్టాప్ పెట్టేసింది. గజనీని దాటగలిగే మెమిరీ లాస్ కథ ఉంటే తప్ప గెలవటం కష్టం. దాంతో ఇప్పుడు మెమరీ లాస్ పాయింట్ అనేది ..ఓ కామెడీ వ్యవహారంగా మారిపోయింది.  దానికి తోడు కరణాకరణ్ కూడా ఈ స్టోరీ లైన్ పాతది కదా..ఇప్పటికాలం మేకింగ్ తో సినిమా చేస్తే బాగోదేమో అని డౌట్ పడినట్లున్నారు. ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్లి ఈ సినిమా చేసి న్యాయం చేసారు.

‘తొలి ప్రేమ’ను మర్చిపోవటం కష్టం…

ఎవరి జీవితంలో అయినా ‘తొలి ప్రేమ’ మర్చిపోవటం కష్టం. కరుణాకరణ్ జీవితంలో అది మరీ స్పెషల్. ఆ సినిమాని ఆయనే ఈ సినిమా చేస్తున్నంతకాలం చూసి ప్రేరణ పొందినట్లున్నారు. ఆ నీడలు సినిమా అంతా పరుచుకుని ఉన్నాయి.

మిగతా టీమ్…

సాధారణంగా ప్రేమ కథలకు పాటలే ప్రాణం. ఆ విషయం  ఈ సారి కరుణాకరణ్ ఎలా మర్చిపోయారో మరి. మరీ ముఖ్యంగా సినిమాలో ఎమోషన్ సీన్స్ చాలా కృత్రిమంగా ఉన్నాయి. కావాలని ఇక్కడ అలాంటి సీన్ రావాలి కాబట్టి రాసినట్లు, తీసినట్లు అనిపించటం సాయి ధరమ్ తేజ దురదృష్టమే.

ఇక నటుడుగా సాయి పాత్రలో లైనమై ..డల్ గా నటించుకుంటూ పోయారు. ఆయన్నేమీ తప్పు పట్టలేం. కాస్త ఒళ్లు కూడా చేసాడు.

హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ వంటి మంచి నటిని  ఎంచుకున్నారు ..కానీ ఆమె టాలెంట్ కు తగ్గ పాత్ర కాదు..అలా అలా చేసుకుంటూ వెళ్లిపోయింది. గుర్తు పెట్టుకోదిన పాత్ర కాదు.

సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.హ్యాపీ ఫ్యామిలీ, అంద‌మైన చంద‌మామ పాటలు,  మేకింగ్  సినిమాకి హైలెట్‌గా నిలిచాయి.
డార్లింగ్ స్వామి మాట‌లు అక్క‌డ‌క్క‌డా బాగున్నాయనిపించాయి.

సినిమాలో ఇమిడిందా లేదా అనేది ప్రక్కన పెడితే పృధ్వీ కామెడీ బాగుంది.

బుల్లి సందేహం..

యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం మొమిరీస్ ఎగిరిపోవాలి కానీ.. తను ఇండియాకు వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలను మాత్రమే హీరోయిన్ మర్చిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెది పార్షియల్ మెమెరీలాస్ ఏమో…

ఫైనల్ థాట్…

సినిమాలు చూసే వాళ్ల మెమెరీలోంచి కొన్ని సూపర్ హిట్ సినిమాలు మాయమైపోతే కానీ ఇలాంటి సినిమాలకు ఆదరణ దొరకదు. కాబట్టి ముందు..ఆ మెమెరీ లాస్ స్కీమ్ లు ఏవో ప్రేక్షకులకు అప్లై అయ్యే మార్గం వెతకాలి. లేకుండా ఈ సినిమాలకు మెమెరీలో కొంచెం కూడా స్పేస్ దొరకదు.

రేటింగ్ : 2

న‌టీన‌టులు: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు.
కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్
క‌ళ‌: సాహి సురేశ్
సంగీతం: గోపీ సుందర్‌
ఛాయాగ్ర‌హ‌ణం: అండ్రూ.ఐ
మాటలు: డార్లింగ్‌ స్వామి
సహ నిర్మాత: వల్లభ
నిర్మాత: కె.ఎస్‌.రామారావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌
సంస్థ‌: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్
విడుద‌ల‌: 6 జూన్ 2018

surya-prakash

– సూర్యప్రకాష్ జోశ్యుల

- Advertisement -