యూత్‌ని ఆకట్టుకునే హీరో మోటో కార్ప్ కొత్త బైక్స్…

12:29 pm, Wed, 1 May 19
hero motocorp new bikes

ఢిల్లీ: ప్రముఖ దేశీయ ద్విచక్రవాహనాల తయారీదారు ‘హీరో మోటో కార్ప్’ యువతని ఆకట్టుకునే ఫీచర్లు గల రెండు కొత్త బైకులని బుధవారం భారత్ మార్కెట్లో విడుదల చేయనుంది.  ‘హీరో ఎక్స్ ప్లస్ 200’, ‘హీరో ఎక్స్ పల్స్ 200 టీ (టూరర్)ల పేరిట ఇవి భారత్ మార్కెట్లో సందడి చేయనున్నాయి.

వీటిల్లో ఎక్స్‌పల్స్ 200 బైక్ అడ్వెంచర్లకి, ఎక్స్‌పల్స్ 200 టీ మోడల్ బైక్ లాంగ్ టూర్లకి ఉపయోగపడేలా రూపొందించారు. ఇక ఈ బైక్‌లు ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.15 లక్షలు వరకు ఉండే అవకాశం ఉంది.

ఇక ఫీచర్ల విషయానికొస్తే  హీరో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్‌లో…గతేడాది హీరో నుంచి వచ్చిన హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ మోడల్ బైక్‌లో వాడిన ఇంజిన్‌నే వినియోగిస్తున్నారు. అందులో ఇంజిన్ 199.6సీసీ, ఎయిర్ కూల్డ్, 4- స్ట్రోక్, 2- వాల్వ్‌తోపాటు  18.3 హెచ్పీ, 17.1 ఎన్ఎం ఆఫ్ టార్చి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్‌లో 5- స్పీడ్ కాంస్టంట్ మెష్ గేర్ బాక్స్ అమర్చారు.

అలాగే హీరో ఎక్స్‌పల్స్ 200 బైక్‌కు ‘నాబీ టైర్లు’, 825 ఎంఎం ఎత్తుపై సీటు అమర్చారు.  ఇందులో 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రేర్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇక ఈ రెండు బైకుల్లో సింగిల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ హెడ్ అండ్ టెయిల్ లాంప్స్, డిజిటల్ స్పీడో మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.