21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home బాలీవుడ్ ‘డిన్నర్’ అంటే అదే.. క్యాస్టింగ్ కౌచ్ సీక్రెట్ కోడ్ వర్డ్ బయటపెట్టేసిన కామసూత్ర బ్యూటీ

‘డిన్నర్’ అంటే అదే.. క్యాస్టింగ్ కౌచ్ సీక్రెట్ కోడ్ వర్డ్ బయటపెట్టేసిన కామసూత్ర బ్యూటీ

kamasutra-beauty-sherlyn-chopra-reveals-the-secret-code-of-casting-couch-in-the-film-industry
- Advertisement -

ముంబై: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఆ మధ్య పెనుదుమారం రేపిన పదం.. క్యాస్టింగ్ కౌచ్.

గ్లామర్ ఫీల్డ్ అయిన సినీ ఇండస్ట్రీలో ఇది చాప కింద నీరులా ఎప్పట్నించో సాగుతోందని, ముఖ్యంగా హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే ఈ విషయంలో కాస్త కాంప్రమైజ్ కాక తప్పదనే వారు కూడా లేకపోలేదు.

అయితే సౌత్ సినీ ఇండస్ట్రీలో చిన్మయి, శ్రీరెడ్డి వంటి వారు ఈ క్యాస్టింగ్ కౌచ్‌ గురించి బహిరంగంగా మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్‌గా మాట్లాడే నటీమణుల జాబితాలోకి తాజాగా కామసూత్ర బ్యూటీ షెర్లిన్ చోప్రా కూడా చేరింది.

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో సినీతారలు అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.

తాము ఏమేం చేస్తున్నారో.. ఎలా కాలం గడుపుతున్నారో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల ద్వారా తెలుపుతూ సోషల్ మీడియాలో తమ అభిమానులను అలరిస్తున్నారు. 

కొంతమంది మీడియా సంస్థలకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తమ అనుభవాల గురించి, తాము ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ లైమ్‌లైట్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

కామసూత్ర బ్యూటీ షెర్లిన్ చోప్రా కూడా ఈ మధ్య ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడుతూ ఓ సీక్రెట్ కోడ్ వర్డ్ కూడా బయటపెట్టేసింది. 

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో…

తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో.. పోర్ట్ ఫోలియోతో ఉదయం వేళ కలిస్తే.. ‘అంతా బాగుంది.. మిగిలిన విషయాలు రాత్రి డిన్నర్‌కి కలిసి మాట్లడుకుందాం..’ అని చెప్పేవారని వెల్లడించింది. 

అయితే కొత్తలో తనకు ‘డిన్నర్’ మీనింగ్ అర్థం అయ్యేది కాదని.. చాలా రోజులకుగాని వాళ్ల ఉద్దేశం ఏమిటో, తనను ఎందుకు డిన్నర్‌కి పిలుస్తున్నారో అర్థమైందని, డిన్నర్ అంటే కమిట్‌మెంట్ అడిగినట్లుగా భావించాలని పేర్కొంది.  

అయితే తనను మామూలు డిన్నర్‌కి పిలుస్తున్నారని అనుకున్నేదాన్నని, మరీ రాత్రి 11, 12 గంటల సమయంలో పిలుస్తుండడంతో తాను రాలేనని చెప్పేదాన్నని షెర్లిన్ వివరించింది. 

కొన్నిసార్లు డిన్నర్ సమయానికి తాను వెళ్లినా.. ఆ సమయంలో వాళ్ల ప్రవర్తన తీరు నచ్చక వాళ్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసి తిరిగి వచ్చేసేదాన్నని, దీంతో తనకు ఎన్నో అవకాశాలు రాకుండా చేశారని ఈ బ్యూటీ ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రస్తుతం సినిమాలకు దూరమైన షెర్లిన్ చోప్రా ఖాళీగా మాత్రం లేదు. సొంతంగా తానే ఓ యాప్ నిర్వహిస్తోంది. ఈ యాప్‌లో తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. తన అభిమానులను అలరిస్తూ.. బాగానే సంపాదిస్తోంది.

 

- Advertisement -