నటుడు సుశాంత్ సింగ్‌కు ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ నివాళి

- Advertisement -

పారిస్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ నివాళులు అర్పించింది. భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని యూనివర్సిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

సైన్స్, టెక్నాలజీ, ఇంజీనింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యకు సుశాంత్ చాలా మద్దతు ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.  ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీని ఆయన ఫాలో అయ్యేవారని తెలిపింది.

గతేడాది వేసవిలో యూనివర్సిటీ సెంట్రల్ క్యాంపస్‌ని సందర్శించాలని ఆయనను కోరామని, ఇక్కడకు వచ్చేందుకు ఆయన కూడా ఓకే చెప్పారని గుర్తు చేసుకుంది.

అయితే, కొన్ని కారణాల వల్ల సుశాంత్ రాలేకపోయారని పేర్కొంది. ఆయన ఙ్ఞాపకాలు తమకు ఎప్పుడూ గుర్తుంటాయని తెలిపింది. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటారని పేర్కొంది.

చదువులో చురుగ్గా ఉండే సుశాంత్ ఏఐఈఈఈలో అఖిల భారత స్థాయిలో ఏడో ర్యాంకు సాధించారు. నేషనల్ ఫిజిక్స్‌ ఒలంపియాడ్‌లో బంగారు పతకాన్ని సాధించారు.

ఫిజిక్స్‌, ఆస్ట్రానమీలో ఎంతో ఆసక్తి కలిగిన సుశాంత్ ‘చందమామ దూర్‌ కే’ అనే చిత్రంలో నటించేందుకు ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాలో ట్రైనింగ్ తీసుకున్నారు. అయితే, ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకుండానే ఆగిపోగింది.

- Advertisement -