వైద్యులకు తన ‘కూలీ’ పాటను అంకితమిచ్చిన అమితాబ్ బచ్చన్

bollywood-big-b-amitabh-bachchan-dedicates-his-coolie-song-to-doctors
- Advertisement -

ముంబై:  క‌రోనా వైర‌స్ బారిన ప‌డి ప్రపంచం మొత్తం వణుకుతున్న సమయంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌తి రోజు ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా గ్లోబ్‌ని ఎత్తుకున్న డాక్ట‌ర్ ఫోటోని షేర్ చేసిన అమితాబ్.. త‌ను ‘కూలీ’ చిత్రంలోని పాట పల్లవులను దానికి జోడించారు.

సారీ దునియా కా భోజ్ హ‌మ్ ఉఠాతే హై (ప్రపంచం మొత్తం భారాన్ని మేము భరిస్తాము…) అని దానికి  క్యాప్షన్ తగిలించారు.

ప్ర‌స్తుతం విశ్రాంతి లేకుండా క‌రోనాతో ఫైట్ చేస్తున్న వైద్యుల‌పై జ‌ర‌ుగుతున్న దాడుల‌ను అమితాబ్ ఈ ట్వీట్ ద్వారా ఖండించినట్టు అర్థమవుతోంది.

త‌మ ప్రాణాల‌ని  ప‌ణంగా పెట్టి కుటుంబ స‌భ్యుల‌కి దూరంగా ఉంటూ 24 గంట‌లూ ప్ర‌జా సేవ కోసం ప‌ని చేస్తున్న వైద్యుల‌ని దేవుడిలా చూడాలి త‌ప్ప వారిపై దాడులు చేయోద్ద‌న్న విష‌యాన్ని నెటిజ‌న్స్ కూడా గుర్తు చేస్తున్నారు.

- Advertisement -