25.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఉత్కంఠ వీడింది: విశాఖ ఉత్తరం నుంచి గంటా గెలిచినట్లు ప్రకటించిన ఈసీ…

ఉత్కంఠ వీడింది: విశాఖ ఉత్తరం నుంచి గంటా గెలిచినట్లు ప్రకటించిన ఈసీ…

- Advertisement -

విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి, మాజీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు గెలిచినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2250 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.

గురువారం రాత్రి వీవీప్యాట్లను లెక్కించే సమయంలో అందులో పోలైన ఓట్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 42వ పోలింగ్‌బూత్‌కి సంబంధించిన వీవీప్యాట్‌లో 371 ఓట్లు పోలైతే కేవలం 107 మాత్రమే పోలైనట్లు చూపిస్తుండటంతో వైసీపీ అభ్యర్థి కేకే రాజు అభ్యంతరం తెలిపారు.

దీంతో అధికారులు ఫలితాన్ని పెండింగులో పెట్టడంతో పాటు నియోజకవర్గ చివరి రౌండ్‌ వివరాలను వెల్లడించలేదు. అప్పటికే గంటా 2వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే వీవీప్యాట్లకు సంబంధించిన ఓట్లను కేకే రాజుకు కలిపినా కూడా.. గంటా శ్రీనివాసరావుకే ఆధిక్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఈసీని సంప్రదించి గంటా విజయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడతూ.. విశాఖలో నాలుగు స్థానాల్లో గెలిచి టీడీపీ బలంగా ఉందని నిరూపించామని ప్రకటించారు. తాము చేసిన సేవను గుర్తించే ప్రజలు ఓట్లు వేశారని, ప్రజా తీర్పును ఎవరైనా శిరసా వహించాల్సిందేనని తెలిపారు. ఎన్నికల ఫలితాలపై త్వరలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని గంటా పేర్కొన్నారు.

చదవండి:  జగన్ అదృష్ట సంఖ్య ఇదేనా.. వైరల్ అవుతున్న మెసేజ్!
- Advertisement -