
హైదరాబాద్: నటి, నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్‌మెంట్‌తో కొణిదెల వారింట సందడి నెలకొంది.
నిహారిక నిశ్చితార్థం గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం రాత్రి జరిగిన సంగతి విదితమే.
కరోనా నేపథ్యంలో అతికొద్ది సన్నిహితుల సమక్షంలో జరిగిన ఫంక్షన్‌కు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర తారాగణం సతీమేతంగా హాజరయ్యారు.
సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీలోని ఆడపడుచులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెగా ఫ్యామిలీలో జరిగిన ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
ఇక శుక్రవారం నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిహారిక నిశ్చితార్థ వేడుకలోని మరిన్ని ఫొటోలను ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల మీడియాలో వైరల్ అవుతోంది.
కాబోయే వధూవరులతో ఇరువైపుల కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
నిహారిక-చైతన్యల జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి మీరూ ఓ లుక్కేయండి.








