
- Advertisement -
న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం మరోమారు పొడిగింది.
జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించింది. అలాగే కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
జూన్ 8 నుంచి ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే స్కూళ్లు, కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది.
కట్టడి ప్రాంతాల్లో లాక్డౌన్ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై ఫేజ్-3లో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. కట్టడి ప్రాంతాల్లో అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
- Advertisement -








