23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ శ్రీదేవి దేవకన్య అయితే.. నేను మాసిన గడ్డంతో సామాన్యుడిలా, అదే కరెక్ట్: మెగాస్టార్ చిరంజీవి

శ్రీదేవి దేవకన్య అయితే.. నేను మాసిన గడ్డంతో సామాన్యుడిలా, అదే కరెక్ట్: మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi-and-sridevi-in-jagadekaveerudu-athilokasundari
- Advertisement -

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి, నిజమైన అతిలోక సుందరి శ్రీదేవి నటించిన ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ చిత్రం ఒకటి. 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 

చదవండి: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఐశ్వర్యారాయ్ లీక్డ్ వీడియో.. చూస్తే కళ్లు తిప్పుకోలేరు మరి!

‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ చిత్రం 1990 మే 9న విడుదలై విజయదుందుభి మోగించింది. ఈ ఏడాది మే 9కి ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు అవుతుంది. 

విభిన్నంగా 30 ఇయర్స్ సెలబ్రేషన్స్…

ఈ నేపథ్యంలో ఈ చిత్రం 30 ఇయర్స్ సెలబ్రేషన్స్‌ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ విభిన్నంగా ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ నేచురాల్ స్టార్ నాని వాయిస్ ఓవర్‌తో కూడిన వీడియోలను రిలీజ్ చేస్తోంది. 

ఈ క్రమంలో తొలి వీడియో ఇప్పటికే విడుదలైంది. ఈ వీడియోలో.. అసలు ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ చిత్రం తీయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించారు. 

చిరంజీవితో ఒక ఫాంటసీ చిత్రం…

ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ తరహాలో.. చిరంజీవితో ఒక ఫాంటసీ చిత్రం నిర్మించాలనేది వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కోరిక అట. అయితే అలాంటి చిత్రం తీయడం ఒక్క కె.రాఘవేంద్ర రావుకే సాధ్యమని ఆయన విశ్వాసం. 

చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

దీంతో అశ్వనీదత్ ఇటు రాఘవేంద్ర రావుతో, అటు రచయిత శ్రీనివాస్‌ చక్రవర్తితో మాట్లాడి.. ఇద్దరినీ తిరుమలకు పంపించారు. తిరుమలలో ఉండగా శ్రీనివాస్ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. 

భలే పాయింట్…

‘దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పొరపాటున పడిపోతుంది. ఆ ఉంగరం కాస్తా ఓ మానవుడికి దొరుకుతుంది.. ఇక అక్కడ్నించి అసలు కథ మొదలవుతుంది – ఇదీ చిత్రం అవుట్ లైన్.

ఈ పాయింట్ ఇటు దర్శకుడు రాఘవేంద్ర రావుకు, అటు నిర్మాత అశ్వినీదత్‌‌కు బాగా నచ్చేసింది. ఇంకేముంది – కట్ చేస్తే.. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ తెలుగు వారిని ఒక ఊపు ఊపేసింది. 

sridevi-in-jagadekaveerudu-athilokasundariదేవకన్య పాత్రకు.. శ్రీదేవి

అయితే దేవకన్యలా కనిపించగలిగే నటి ఎవరు అని ఆలోచిస్తుండగా అందరికీ శ్రీదేవి అయితే సరిగ్గా సరిపోతుందని అనిపించింది. అంతే – ఇక కథని రసవత్తరంగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది వైజయంతీ మూవీస్ సంస్థ. 

చదవండి: యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు.. ఇప్పుడు మెడకు చుట్టుకున్న రెండేళ్లనాటి ప్రోగ్రాం..

దర్శకుడు రాఘవేంద్ర రావు, కమర్షియల్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల, రచయిత విజయేంద్ర ప్రసాద్.. ఇలా ఆయా రంగాల్లో దిగ్గజాలైన వారంతా వైజయంతీ మూవీస్ కార్యాలయంలో చేరారు. 

అది చిరంజీవి సూచనే…

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. శ్రీదేవి దేవకన్య అయినప్పుడు.. తనకు వేరే గెటప్‌లు అవసరం లేదని, మాసిన గడ్డంతో సామాన్య మానవుడిలా తాను కనిపిస్తే బాగుంటుందని చిరంజీవి సూచించారట. అది అందరికీ నచ్చేసింది.

అలా తెలుగు వారిని కొన్ని నెలలపాటు ఒక ఊపు ఉపేసిన చిత్రం ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ జర్నీ మొదలైనట్లు వైజయంతీ మూవీస్ సంస్థ తాజాగా విడుదల చేసిన వీడియోలో హీరో నాని వివరించాడు. 

మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి…

 

- Advertisement -