25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రెండో విడత లాక్‌డౌన్.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

రెండో విడత లాక్‌డౌన్.. మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర హోం శాఖ

guidelines on lockdown released by the union home ministry
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌‌ను మే 3 వరకు మంగళవారం పొడిగించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ పొడిగింపు తప్ప మరో మార్గం లేదని తన ప్రసంగంలో చెప్పిన సంగతి తెలిసిందే. 

చదవండి: లాక్‌డౌన్‌పై వీడిన సస్పెన్స్.. మే 3 వరకు కొనసాగింపు, ప్రధాని ఇంకా ఏమన్నారంటే…

తొలివిడతగా ఏప్రిల్ 14 వరకు విధించిన లాక్‌డౌన్‌ను తాజాగా మే 3 వరకు పొడిగించారు. ఈ రెండో విడత లాక్‌డౌన్‌లో  దేశంలోని ఆసుపత్రులతో పాటు వెటర్నరీ ఆసుపత్రులు, మందుల దుకాణాలు, లేబొరేటరీలు, క్లినిక్‌లతో పాటు అత్యవసర విభాగాలన్నీ గతంలో మాదిరిగానే పనిచేస్తాయి.

నిత్యావసరాలు మినహా అన్నీ మూత…

నిత్యావసరాలు మినహా దేశంలోని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలు మూసి వేసే ఉంచాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు వంటి వాటికి మాత్రం లాక్‌డౌన్ నుంచి యథాతథంగా మినహాయింపు ఇచ్చారు.

దేశంలోని పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లపై ఎప్పటి మాదిరిగానే నిషేధం అమలులో ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలి. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కూడా కొనసాగుతుంది.

చదవండి: షాకింగ్: ఉస్మానియాలో పీజీ వైద్యులపై.. రోగుల దాడి! అసలేం జరిగిందంటే…

అయితే, రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, జాతీయ సమాచార కేంద్రాలు వంటి సంస్థలకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.

రాష్ట్రాల్లో ఇలా…

రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి వాటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు వంటి సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

చదవండి: కరోనాతో ప్రాణ స్నేహితుడి మృతి.. విషాదంలో అగ్ర రాజ్యం అధినేత!
- Advertisement -