22.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం చలికి వణుకుతున్న ఉత్తర భారతం.. గడ్డకట్టుకుపోయిన దాల్ సరస్సు

చలికి వణుకుతున్న ఉత్తర భారతం.. గడ్డకట్టుకుపోయిన దాల్ సరస్సు

- Advertisement -

న్యూఢిల్లీ: చలితో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు మైనస్‌లలోకి పడిపోతున్నాయి. శీతల గాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో హరియాణా ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది.

వెలుతురు మందగించడంతో ఢిల్లీలోని పలు విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, జమ్మూ, కశ్మీర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6.2 డిగ్రీలకు పడిపోగా, ద్రాస్‌లో ఏకంగా మైనస్ 28.7 డిగ్రీలకు పడిపోయింది. దాల్ సరస్సు అయితే ఏకంగా గడ్డకట్టుకుపోయింది. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు.

- Advertisement -