
- Advertisement -
ముంబై: గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్ గత రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. ముంబైలోని సుజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గత రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్లో పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్(1982) వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2007లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఖయ్యం సాబ్.. ఉమ్రావో జాన్ చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు.
2011లో భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. ప్రధాని మోదీ సహా ఖయ్యం సాబ్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
- Advertisement -








