29.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో చోటు…

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నిక: ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌’లో చోటు…

- Advertisement -

నిజామాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక అరవింద్ చేతిలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు.

అయితే దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థానం నుంచి 185 మంది పోటీ చేసి….అందరి దృష్టిని ఆకర్షించింది. తమ సమస్యలని పరిష్కరించాలంటూ పసుపు, ఎర్రజొన్న రైతులు కవితకి వ్యతిరేకంగా పోటీ చేశారు. అందువలనే కవిత ఓటమి పాలయ్యారని తెలుస్తోంది.

ఇక మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పెద్ద కసరత్తే చేసింది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండడంతో 12 బ్యాలెట్ యూనిట్లతో 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

అలాగే ఈ ఎన్నిక ఏర్పాట్ల కోసం 2 వేల మంది ఎన్నికల సిబ్బంది, 600 మంది ఇంజనీర్లు ఐదు రోజులపాటు కష్టపడ్డారు. 2 వేల కంట్రోల్ యూనిట్లు, 2 వేల వీవీప్యాట్లు, 15 హాళ్లు, 149 టేబుళ్లు ఉపయోగించారు.

ఇక  ఈ స్థాయిలో ఎన్నిక నిర్వహించడం చరిత్రలోనే ఇదే తొలిసారని ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పేర్కొంది. ఈ మేరకు నిజామాబాద్‌లో గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్‌కు, భారత ఎన్నికల సంఘానికి లేఖలు పంపింది. ఈ ఎన్నికను సమర్థంగా నిర్వహించిన తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ పేరును కూడా రికార్డులో చేర్చింది.

త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించనుంది.

చదవండి: నేడే తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు..!
- Advertisement -