
అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. జూన్ 13 నుంచి సమ్మెను చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఇక దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను 12వ తేదీ నుంచే నిలిపివేయనుంది.
కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లింపుసహా 27 డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అలాగే ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా కార్మికులని నుంచి వస్తుంది.
అయితే అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని… ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఆర్టీసీ జెఏసీ కోరుతుంది. ఇక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సన్నాహా సభలకు సిద్ధమవుతున్నాయి.
ఈరోజు నుంచి 11వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సమ్మె సన్నాహక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు రాజమండ్రిలో తొలి సభ జరగనుండగా.. 4న శ్రీకాకుళం, విశాఖపట్నంలో, ఈ నెల 6న ఒంగోలులో, ఈ నెల 7న నెల్లూరు, తిరుపతి, ఏలూరులో, ఈ నెల 8న కడపలో, ఈ నెల 9న కర్నూలు, అనంతపురంలో, ఈ నెల 10న గుంటూరులో, ఈ నెల 11న విజయవాడలో సన్నాహక సభలు నిర్వహించనున్నారు.








