
అమరావతి: ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించడం….కేబినెట్‌లో స్థానం కోసం ఎక్కువ పోటీ ఉండటంతో సీఎం జగన్…మంత్రివర్గ విస్తరణపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. తన కేబినెట్‌లో సామాజిక, ప్రాంతీయ సమతౌల్యం పాటించాలని జగన్ అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు గురించి జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ నెల8న మంత్రివర్గ విస్తరణ ఉండనుంది.
వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… జిల్లాల వారీగా పదవి దక్కే అవకాశం ఉన్నవారిని ఎంపిక చేసుకుని …చివరికి అన్నీ సామాజిక, ప్రాంతీయ సమీకరణలు చూసుకుని అందులో కొందరికి మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది.
జిల్లాల వారీగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న వారు వీరే…
శ్రీకాకుళం: కంబాల జోగులు (రాజాం-ఎస్సీ), తమ్మినేని సీతారాం (ఆమదాలవలస–బీసీ), ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)/ ధర్మాన కృష్ణదాసు (నరసన్నపేట-బీసీ), కళావతి (పాలకొండ-ఎస్టీ).
విజయనగరం: బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి–బీసీ), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం- ఓసీ-వైశ్య), పుష్పశ్రీవాణి (కురుపాం-ఎస్టీ).
విశాఖపట్నం: అవంతి శ్రీనివాస్ (భీమిలి-కాపు), కరణం ధర్మశ్రీ (చోడవరం-కాపు), గుడివాడ అమరనాథ్(అనకాపల్లి-కాపు), ముత్యాల నాయుడు (మాడుగుల-బీసీ).
తూర్పు గోదావరి: ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ), పినిపె విశ్వరూప్ (అమలాపురం-ఎస్సీ), దాడిశెట్టి రాజా (తుని-కాపు).
పశ్చిమగోదావరి: ప్రసాదరాజు (నరసాపురం-క్షత్రియ), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం-కాపు). కృష్ణా జిల్లా: కొడాలి వెంకటేశ్వరరావు-నాని) (గుడివాడ-కమ్మ), కొలుసు పార్థసారథి (పెనమలూరు-బీసీ), పేర్ని నాని (బందరు-కాపు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట-కాపు).
గుంటూరు: మేకపాటి సుచరిత (ప్రత్తిపాడు-ఎస్సీ), మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ ఇస్తారు- కమ్మ), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-రెడ్డి), అంబటి రాంబాబు (సత్తెనపల్లి-కాపు).
ప్రకాశం : బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు- రెడ్డి), ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం-ఎస్సీ).
నెల్లూరు: మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-రెడ్డి), కాకాణి గోవర్ధన్‌రెడ్డి (సర్వేపల్లి-రెడ్డి), అనిల్‌కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-బీసీ).
చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-రెడ్డి), ఆర్.కె.రోజా (నగరి-రెడ్డి).
కడప: అంజాద్ బాషా (కడప- ముస్లిం), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు-ఎస్సీ). అనంతపురం: అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్-రెడ్డి), శంకరనారాయణ (పెనుకొండ-బీసీ), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం-బీసీ).
కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-రెడ్డి), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం-రెడ్డి).








