24.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రికార్డు: ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం…

రికార్డు: ఐదోసారి ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకారం…

- Advertisement -

భువనేశ్వర్: బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో వరుసగా ఐదోసారి సీఎం బాధ్యతలని చేపట్టిన నాయకుడిగా నిలిచారు. ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు, సిక్కింలో పవన్ చామ్లింగ్ మాత్రమే ఐదుసార్లు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ తర్వాత దేశంలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో సీఎంగా నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టించారు. భువనేశ్వర్‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈరోజు ప్రజల సమక్షంలో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఒడిశా గవర్నర్ గనేషీ లాల్…నవీన్ చేత ప్రమాణం చేయించారు. ఇక నవీన్‌తో పాటు 11 మంది కేబినెట్ మంత్రులనూ, 9 మంది సహాయ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, తాజాగా ఒడిశాలో మొత్తం 147 స్థానాలకి 146 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. ఇక ఇందులో బీజేడీ ఏకంగా 112 సీట్లు సాధించింది. అలాగే బీజేపీ 23 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

చదవండి: భువనగిరిలో ‘కారు’ కొంపముంచిన  రోడ్డురోలర్‌…
- Advertisement -