26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం గాడ్సే దేశభక్తుడు అన్న సాధ్వీపై కేటీఆర్  ఫైర్…

గాడ్సే దేశభక్తుడు అన్న సాధ్వీపై కేటీఆర్  ఫైర్…

- Advertisement -

హైదరాబాద్: ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే బీజేపీ నేత, మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరో వివాదంలో చిక్కుకుంది. జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇక ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అని ట్వీట్ చేశారు. గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు భేషరతుగా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎవరు ఎలాంటి రాజకీయాలతో ముడిపడి ఉన్నా, ఏ సిద్ధాంతాలతో అంటకాగినా కొన్ని హద్దులు మాత్రం ఎప్పటికీ దాటకూడదని కేటీఆర్ హితవు పలికారు.

చదవండి: కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు! వైసీపీ నేత సంచలన ప్రకటన…

సాధ్వీ వ్యాఖ్యలపై స్పదించిన ఈసీ…

సాధ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి వివరాలతో నివేదిక అందించాలంటూ మధ్యప్రదేశ్ సీఈవోను ఆదేశించింది. కాగా, సాధ్వీ మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

చదవండి: రాహుల్ ఓ ఫిరంగి.. మోడీ రాఫెల్ ఏజెంట్: సిద్ధూ
- Advertisement -