26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మెగా ప్రిన్స్!

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన మెగా ప్రిన్స్!

Varun-Tej
- Advertisement -

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఫిదా, తొలిప్రేమ, F2.. ఇలా వరుస హిట్లతో మంచి జోరుమీద కనిపిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ వాల్మీకి సినిమాతో బిజీగా గడుపుతున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్ కనిపించనున్నారు.

గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న వ్యక్తి సినీ రచయితగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండకు ఇది రీమేక్. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు వరుణ్ తేజ్ పారితోషికం బాగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. వరుణ్ రూ.6.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు అని సమాచారం.

F2 సినిమా వరకు వరుణ్ రూ.4 నుంచి రూ.4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ‘F2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వరుణ్ తన పారితోషికాన్ని పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

కెరీర్ ప్రారంభంలో కోటి రూపాయల నుంచి రూ.2.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న వరుణ్ ఆ తరవాత రూ.4 కోట్లకు పెంచారని అంటారు. ఇప్పుడు దాన్ని రూ.6.5 కోట్లు చేశారని తెలుస్తోంది. కాగా, ‘వాల్మీకి’ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వాల్మీకితో పాటు వరుణ్ మరో సినిమాను కూడా అంగీకరించారు.

- Advertisement -