24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పవన్ కల్యాణ్ పాటకు జెన్నిఫర్ లోపెజ్ ఫిదా! పైకి లేచి మరీ చప్పట్లు…

పవన్ కల్యాణ్ పాటకు జెన్నిఫర్ లోపెజ్ ఫిదా! పైకి లేచి మరీ చప్పట్లు…

Pawan Kalyan Latest News, jennifer Lopez Latest News, Tollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి. పవన్ కల్యాణ్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా అభిమానుల అంచనాలని అందుకోవడంలో సఫలం కాలేకపోయింది. కానీ, ఆ సినిమాలోని పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా ఈ సర్దార్ సినిమాలోని ఓ పాటకు కొందరు భారత యువకులు చేసిన డ్యాన్స్‌కి పాప్ సింగర్ కమ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, హాలీవుడ్ నటి అయిన జెన్నిఫర్ లోపెజ్ మైమరచిపోయింది. ఓ అంతర్జాతీయ చానల్‌లో ప్రసారమయ్యే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంటర్నేషనల్ డ్యాన్స్ రియాల్టీ షోలో ఆమె కూడా ఓ న్యాయనిర్ణేత.

అదిరిపోయే పెర్ఫార్మెన్స్…

ఈ షోలో భాగంగా ఇండియా నుండి ముంబయి కుర్రాళ్లతో కూడిన ‘ద కింగ్స్’ అనే గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేసింది. షో ఫినాలే సందర్భంగా ‘ద కింగ్స్’ డ్యాన్సర్లు సర్దార్ గబ్బర్ సింగ్ లోని ‘వాడెవడన్నా వీడెవడన్నా.. సర్దార్ అన్నకు అడ్డెవరన్నా..’ అనే పాటకు 300 సినిమా కాన్సెప్ట్‌ను మిక్స్ చేసి అదిరిపోయే రీతిలో పెర్ఫామ్ చేశారు.

స్టేజ్ డ్యాన్స్ అయినా ఆ పాటలో ‘ద కింగ్స్’ బృందం ప్రదర్శించిన థ్రిల్స్, నాట్య విన్యాసాలు చూసి స్టార్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఉద్వేగం పట్టలేకపోయింది. తన సీట్లోంచి పైకి లేచి మరీ చప్పట్లు చరిచి ‘ద కింగ్స్’ బృందాన్ని అభినందించింది. మరి ఆ పాటకి ఈ బృందం ఏ విధంగా నృత్యం చేసిందో మీరూ ఓ లుక్కేయండి!

https://www.youtube.com/watch?v=vweyQrGMEAk

- Advertisement -