22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం జీవీఎల్ రాసిన పుస్తకంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

జీవీఎల్ రాసిన పుస్తకంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

chandrababu comments on gvl book
- Advertisement -

అమరావతి: తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు మొరాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబు ఈవీఎంల మొరాయింపులపై మళ్ళీ వ్యాఖ్యానించారు.

ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయని వాపోయారు. ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరికి పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాసిన ‘డెమోక్రసీ ఎట్ రిస్క్’ పుస్తకం గురించి చంద్రబాబు ప్రస్తావించారు.

చదవండి: పోలింగ్ సరళిపై బాబు లెక్కలు.. రేపటి నుంచి నేతలతో మీటింగులు…

ఈవీఎంల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుని జీవీ‌ఎల్ పుస్తకం రాశారని.. ఇప్పుడు అదే ఈవీఎంలను ఆయన సమర్థిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

నా పోరాటం వల్లే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు

తాము పోరాడడం వల్లే 5 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి పడినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయని వాపోయారు.

అయితే పశ్చిమబెంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు పెట్టడమనేది దారుణమని… హింస, విధ్వంసాలతో పోలింగ్ శాతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని బాబు ఆరోపించారు.

- Advertisement -