హైదరాబాద్: సల్మాన్ ఖాన్ – రామ్‌చరణ్‌ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే. చరణ్ ఎప్పుడు ముంబై వెళ్లినా… సల్మాన్‌ని కలిసొస్తాడు. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా చరణ్ ఆతిథ్యం ఇస్తాడు.
చరణ్ బాలీవుడ్‌లో ‘జంజీర్’ రీమేక్ చేసినప్పుడు సల్మాన్ అండదండలు అందించాడు. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం తెలుగులో అనువాదం అవుతున్నప్పుడు సల్మాన్ పాత్రకు చరణ్ డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు మరోసారి అదే జరగ బోతోంది. సల్మాన్‌ఖాన్ కొత్త చిత్రం ‘భారత్’.
ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తున్నారు. సల్మాన్ కోసం మరోసారి చరణ్ గొంతు సవరించు కోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్నాడు చరణ్.
కాలిగాయం కారణంగా కొన్ని రోజుల విరామం దక్కింది. ఈ సమయాన్ని ఇలా స్నేహితుడి కోసం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడట. ‘భారత్’ తెలుగు వెర్షన్‌కి చరణ్ రూపంలో ప్రమోషన్ దొరికినట్టే.








