22.7 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ సింగర్ కారుణ్య చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?

సింగర్ కారుణ్య చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా?

singar karunya
- Advertisement -

సింగర్ కారుణ్య ఎన్ని చిన్నప్పుడు కష్టాలు పడ్డాడో తెలుసా?

హైదరాబాద్ : గాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కారుణ్య, తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. మా నాన్న ఆఫీసుకి, మా స్కూల్స్ కి దగ్గరలో ఉండేలా మా స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాము.

అప్పటికి అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. నీళ్లు, కరెంటు కూడా ఉండేవికావు. అయినా మా కోసం మా నాన్న అక్కడ తుప్పలను బాగుచేయించి ఇల్లు కట్టించాడు. రెండేళ్ల పాటు ఆ ఇంట్లో కరెంటు లేకుండా వున్నాము. ఇక ఏరోజుకారోజు రిక్షాలో ఎంతో దూరం వెళ్లి ఆ రోజుకి అవసరమైన నీళ్లు తెచ్చుకునే వాళ్లం.

అయితే అవన్నీ పెద్ద కష్టాలుగా మేం ఎప్పుడూ అనుకోలేదు. చుట్టుపక్కల ఇళ్లేమీ లేకపోవడంతో మా ఇంట్లోకి పాములు, తేళ్లు జెర్రులు వచ్చేసేవి. అయినా మేము భయపడింది లేదు. సొంత ఇల్లు అనే ప్రేమ మేము అందులోనే ఉండేలా చేసింది అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -