24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘‘నాకున్న సమయం చాలా తక్కువ.. పెద్ద హీరోలపై కోరిక లేదు..’’

‘‘నాకున్న సమయం చాలా తక్కువ.. పెద్ద హీరోలపై కోరిక లేదు..’’

Niharika Latest News, Konidela Niharika Latest News, Tollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: నిహారిక ప్రధాన పాత్రధారిగా ‘సూర్యకాంతం’ సినిమా నిర్మితమైంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ లో నిహారిక తీరికలేకుండా వుంది.

తాజా ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఓ పది పదిహేనేళ్లు హీరోయిన్‌గా వెలిగి పోవాలని నేను ఇక్కడికి రాలేదు. పెద్ద పెద్ద హీరోలతో కలిసి నటించాలని కలలు కనలేదు. స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఎదురుచూడటం లేదు.

చిరంజీవితో నటించాలనే కోరిక తీరింది…

ఎందుకంటే 30 యేళ్లు వచ్చేలోగానే పెళ్లి చేసేస్తామని ఇంట్లో వాళ్లు చెప్పేశారు. అందువలన నాకున్న సమయం చాలా తక్కువ. ఈ లోగా నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాను. నేను ఎలాంటి కథలకి, పాత్రలకి సెట్ అవుతానో, అలాంటి వాటితోనే దర్శక నిర్మాతలు వస్తున్నారు.

పెద్ద హీరోల జోడీగా చేయమని ఇంతవరకూ ఎవరూ అడగలేదు కూడా. అందరికంటే పెద్ద హీరో అయిన చిరంజీవిగారి సినిమాలో చేయాలని ఉండేది. ‘సైరా’ సినిమాతో ఆ కోరిక కూడా నెరవేరింది అంతకన్నా ఇంకా ఏం కావాలి అని చెప్పుకొచ్చింది.

- Advertisement -