27.2 C
Hyderabad
Friday, October 16, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పవన్ కళ్యాణ్ చాన్స్ కొట్టేసిన రవితేజ? కాజల్, కేథరిన్‌లతో జంటగా మరో సినిమా…

పవన్ కళ్యాణ్ చాన్స్ కొట్టేసిన రవితేజ? కాజల్, కేథరిన్‌లతో జంటగా మరో సినిమా…

Ravi teja Latest Movie Updates, Tollywood Latest News, Disco Raja New Movie News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం ‘డిస్కో రాజా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తేరి సినిమా రీమేక్‌లో రవితేజ నటించనున్నాడు. దీనికి ‘కనకదుర్గ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో సమంత, అమీ జాక్సన్ నటించగా, తెలుగులో కాజల్, కేథరిన్ థ్రెసాను ఎంపిక చేసుకున్నారు.

కథ ప్రకారం.. సినిమాలో రవితేజకి భార్యగా కాజల్ కనిపించనుందని సమాచారం. గతంలో కూడా ఈ జంట రెండు సినిమాలకు కలిసి పని చేశారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్‌ని అనుకున్నారు. కానీ పవన్ పాలిటిక్స్‌లోకి వెళ్లిపోవడంతో రవితేజతో కానిచ్చేస్తున్నారు.

- Advertisement -