22.1 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ వైష్ణవ్ తేజ్ సినిమాలో నెగటివ్ రోల్ లో తమిళ స్టార్ హీరో

వైష్ణవ్ తేజ్ సినిమాలో నెగటివ్ రోల్ లో తమిళ స్టార్ హీరో

Tamil Star Hero, Vijay Sethupathi News, Vaishnav Tej Movie News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. జాలరుల కుటుంబానికి చెందిన యువకుడిగా ఈ సినిమాలో వైష్ణవ తేజ్ కనిపించనున్నాడు.

పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆయనను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. డిఫరెంట్ గా డిజైన్ చేయబడిన విలన్ పాత్రకి విజయ్ సేతుపతి సరిగ్గా సరిపోతాడనీ, ఈ సినిమాతో .. ఈ తరహా పాత్రలతో తెలుగులోనూ ఆయన బిజీ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

- Advertisement -