
హైదరాబాద్: మెగా హీరో సాయిధరమ్ తేజ్, నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రేమకథా చిత్రంలో కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ , నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఆరంభించారు. ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 6 సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల లోపే జరగవచ్చని చాలామంది అనుకున్నారు.
కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ హక్కుల ధర తెలియాల్సి వుంది. దర్శకుడిగా కిషోర్ తిరుమలపై గల నమ్మకంతో ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అయినా సాయిధరమ్ తేజ్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఈ సినిమా కూడా హిట్ అవ్వకపోతే సాయి ధరమ్ తేజ్ కి కొంచెం కష్టమే అని అందరూ చర్చించుకుంటున్నారు.
చదవండి:








