27.8 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఓటమికి కుట్ర: తెలంగాణ పోలీసులపై ఏపీలో ఫిర్యాదు

టీడీపీ ఓటమికి కుట్ర: తెలంగాణ పోలీసులపై ఏపీలో ఫిర్యాదు

- Advertisement -

అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలనే లక్ష్యంతో తెలంగాణలోని కొందరు అధికారులు, వైసీపీ నాయకులు కలిసి కుట్ర పన్నారని, అందులో భాగంగా అమరావతి పరిధిలోకి వచ్చి టీడీపీ డేటాను వారు తస్కరించుకుపోయారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. వారిపై కేసులు నమోదు చేసి ఈ మొత్తం కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు బుధవారం రాత్రి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో కళా మాట్లాడుతూ.. వైసీపీకి మేలు చేయాలని తెలంగాణకు చెందిన కొందరు అధికారులు చూస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో విచారించాలా? తెలంగాణలోనా?

ఏపీ డేటా తస్కరణకు గురైతే దానిపై కేసు ఏపీలో నమోదుచేసి విచారించాలా? లేక తెలంగాణలోనా అని ప్రశ్నించారు. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న ఐటీ గ్రిడ్‌ సంస్థపై మార్చి 2న కేసు నమోదైనప్పటికీ.. తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23 నుంచే ఆ సంస్థలో తనిఖీలు చేస్తూ, ఉద్యోగుల్ని భయభ్రాంతుల్ని చేశారని ఆరోపించారు.
రుజువులుగా ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్‌ సంస్థ ఉద్యోగుల్ని పోలీసులు విచారిస్తున్న
ఐటీ గ్ర్స్‌ కార్యాలయంపై ఫిబ్రవరి 23నే సోదాలు

కుట్రలో భాగంగానే తెలంగాణ పోలీసు అధికారులు ఫిబ్రవరి 23న మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై సోదాలు చేశారు. సంస్థ డైరెక్టర్‌ డి.అశోక్‌, ఇతర ఉద్యోగుల్ని విచారించారు. ఆ సంస్థ కంప్యూటర్లలో ఉన్న కొంత స చారాన్ని బలవంతంగా డౌన్‌లోడ్‌ చేశారు. కొన్ని కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు తీసుకెళ్లిపోయారు. ఎఫ్‌ఐఆర్‌, సెర్చ్‌వారెంట్‌ లేకుండానే ఇదంతా చేశారు. తెలంగాణ పోలీసులు తనిఖీలు చేయడం, కంప్యూటర్లు స్వాధీనం చేసుకోవడం సైబరాబాద్‌ కమిషనర్‌కు తెలియదనడం నమ్మశక్యంగా లేదని కళా వెంకట్రావు అన్నారు.

తెలంగాణ పోలీసులు దొంగిలించిన మా సమాచారాన్ని వైసీపీ నాయకులకు అందజేశారు. దాన్ని వాళ్లు ఉపయోగించడమూ ప్రారంభించారు. సమాచారాన్ని దొంగిలించినప్పటికీ కుట్ర పూర్తిగా ఫలప్రదం కాకపోవడంతో మార్చి 2న రాత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సమీప బంధువైన లోకేశ్వర్‌రెడ్డితో మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఉదయం 7 గంటలకే ఐటీ గ్రిడ్‌ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగుల్ని పోలీసులు అపహరించడంతో డి.అశోక్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు.

సైబరాబాద్‌ పోలీసులు వ్యవహరించిన తీరుని కోర్టు తప్పుపట్టడంతో తమ కుట్ర ఎక్కడ విఫలమవుతుందోనన్న భయంతో మరో వైసీపీ కార్యకర్తతో మార్చి 3న రాత్రి 7 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో మరో ఫిర్యాదు చేయించారు. లోకేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు ఏపీ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎస్పీని కలిసినవారిలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు ఉన్నారు.

చదవండి: డేటా చోరీపై దర్యాప్తు ముమ్మరం: సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు

- Advertisement -