28.8 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ప్రేమోన్మాది ఘాతుకానికి బలి: ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచిన రవళి…

ప్రేమోన్మాది ఘాతుకానికి బలి: ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచిన రవళి…

RAVALI
- Advertisement -

వరంగల్‌: వరంగల్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని తోపుచర్ల రవళి (20) చికిత్స పొందుతూ మృతిచెందింది. 90 శాతానికి పైగా కాలిన గాయాలతో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి ఆరోగ్యం సోమవారం సాయంత్రానికి మరింత విషమించింది. దీంతో ఆమె ప్రాణాలు విడిచింది. రవళి మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.

ప్రేమోన్మాది దాడి….

హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతున్న రవళిపై ఫిబ్రవరి 27న అవినాష్ అనే యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యాడు. రవళితో మాట్లాడుతున్నట్లు నటించిన అవినాష్.. ఒక్కసారిగా దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఈ కిరాతకానికి ఒడిగట్టాడు.

మంటల్లో కాలిపోతూ రవళి ఆర్తనాదాలు పెట్టింది. రక్షించాలంటూ కేకలు వేసింది. తీవ్రమైన బాధను అనుభవిస్తూనే తన వివరాలు, దాడి చేసిన యువకుడి వివరాలు చెప్పి కుప్పకూలింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగు పరుగున వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన రవళిని స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

రవళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

చదవండి: తల్లి అయిన ఇంటర్‌విద్యార్థి! కారణం ఎవరో తెలుసా?

- Advertisement -