27.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home టెలివిజన్ బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్య! ప్రేమ వ్యవహారమే కారణమా?

బుల్లితెర వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్య! ప్రేమ వ్యవహారమే కారణమా?

jhansi
- Advertisement -

jhansi suside her plat

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వర్ధమాన సీరియల్‌ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఎన్నో ఆశలతో టీవీ రంగంలో అత్యున్నతమైన స్థాయికి చేరాలనుకున్న ఝాన్సీ సాయి అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రేమే కారణమా…?

ప్రస్తుతం ‘స్టార్ మా’ ఛాన‌ల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్ర బంధం’ సీరియల్‌లో ఝాన్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. కొంతకాలంగా ఒక అబ్బాయితో ఝాన్సీ ప్రేమలో ఉందని, ఇటీవల ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

2019, ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారని, తర్వాట చాటింగ్‌ చేసుకున్నారని, ఆ తర్వాతే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో  ఝాన్సీ ప్రియుడు ఎవరు? ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? అనే విషయాలు తెలుసుకునే పనిలో పోలీసుల పడ్డారు పోలీసులు.

- Advertisement -