23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి, నేడు కేసీఆర్ సమక్షంలో చేరిక…

కాంగ్రెస్‌కు భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి, నేడు కేసీఆర్ సమక్షంలో చేరిక…

vanteru-kcr
- Advertisement -

vanteru pratap reddy

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు నుంచేసుకోది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన లక్ష్యమని పలుమార్లు ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు.. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నిర్వహించే ఓ కార్యక్రమంలో వంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆయనతో పాటు ముఖ్య అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీనికి సంబంధించి ఆయన తన అనుచరులు, అభిమానులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్, హరీశ్ రావుతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి షాకే.. కేసీఆర్ తనకు బద్ద శత్రువని..

కాగా, కేసీఆర్ తనకు బద్దశత్రువు అని ప్రకటించిన వంటేరు ప్రతాప రెడ్డి.. ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆయనపై కేసీఆర్ 56 వేల ఓట్లతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్‌పై ఆయన 19 వేల ఓట్లతో ఓడిపోయారు.

- Advertisement -