

హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాను సన్మానం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యల వెనుక ఓ కారణాన్ని కూడా తెలియజేశారు.
కేసీఆర్కు తన అవసరం లేదని.. కానీ, ఆయన అవసరం తనకుందని జగ్గారెడ్డి తెలతిపారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం సీఎం అవసరం ఉందని ఆయన చెప్పారు.
కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు తాను వేచి చూస్తానని తెలిపారు. తన నియోజకర్గానికి కేసీఆర్ వస్తే సన్మానం చేస్తానని జగ్గారెడ్డి చెప్పడం గమనార్హం. ఆయన రాకపోతే మౌనంగా ఉంటానని అన్నారు.
మా వాళ్లకు కూడా చెప్పా..
టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని తమ వాళ్లకు కూడా చెప్పానని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, ఎప్పుడూ టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసే జగ్గారెడ్డి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.








