26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ పవన్ పెళ్లిళ్లపైనా దుష్ప్రచారమా? మోడీ, కేసీఆర్, జగన్ అందుకే ఒక్కటయ్యారు: చంద్రబాబు

పవన్ పెళ్లిళ్లపైనా దుష్ప్రచారమా? మోడీ, కేసీఆర్, జగన్ అందుకే ఒక్కటయ్యారు: చంద్రబాబు

chandrababu
- Advertisement -

అమరావతి: అసూయపరులంతా ఒక్కటయ్యారంటూ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌లపై ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శలు వర్షం కురిపించారు. ఎలక్షన్ మిషన్ 2019పై టీడీపీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలపై విమర్శలు సంధించారు.

ఏపీ అంటే మోడీకి అసూయ అని, గుజరాత్ కన్నా మించిపోతుందనే భయమని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధి చెందకూడదనేది కేసీఆర్ పంతమని అన్నారు. ఇక తన కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి భయమని ఎద్దేవా చేశారు. ఈ అసూయపరులంతా ఏకమయ్యారని దుయ్యబట్టారు. అక్కసుతోనే బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

రెచ్చగొడుతున్నారు

తెలంగాణలో సెంటిమెంట్ రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చి రగిలిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు స్పందనలేదని అన్నారు. హడావుడిగా జగన్మోహన్ రెడ్డిని బుధవారం కేటీఆర్ అయ్యారని, ఈ భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. అంతేగాక, బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చాలని కుట్రలు చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

అంతేగాక, ఏపీ పర్యటనలో తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపైనా చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆలయాల సందర్శనకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎవరూ కూడా అలాంటి నేతల కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచించారు. బంధుత్వాల పేరుతో పార్టీని దెబ్బతీయొద్దని, అదంతా పార్టీ బయట చూసుకోవాలని అన్నారు. తెలంగాణలో బీసీలపై కేసీఆర్‌ది కపట ప్రేమేనని మండిపడ్డారు. బీసీలను పట్టించుకోని టీఆర్ఎస్, వైసీపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపైనా..

టీడీపీపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసింది వైసీపీనేనని చంద్రబాబు అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై అసభ్యంగా ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తన కుటుంబసభ్యులపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -