28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ ఓకే అనుంటే.. చంద్రబాబు ‘డప్పు’ మరోలా: కన్నాలక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ ఓకే అనుంటే.. చంద్రబాబు ‘డప్పు’ మరోలా: కన్నాలక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

kanna-babu
- Advertisement -

విజయవాఢ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమైన తర్వాతే.. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.

అంతేగాక, చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునివుంటే ఎలా స్పందించేవారో అనే విషయంపై సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ. ‘కేసీఆర్ పొత్తుకు ఒప్పుకుని ఉంటే.. తెలుగువారంతా ఒక్కటయ్యారు. ఇది చంద్రబాబు విజయం. ఇక రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతాయని డప్పుకొట్టేవారు’ అని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు.

పొత్తు పెట్టుకోలేదు కాబట్టే..

అంతేగాక, ‘కేసీఆర్ పొత్తుకు ఒప్పుకోలేదు కాబట్టి.. తెలుగుజాతి ద్రోహులు కేసీఆర్, జగన్, మోడీతో కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు’ అని కన్నా దుయ్యబట్టారు. ఈ మేరకు కన్నా తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

- Advertisement -