
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ ఫలితాల్లో నల్గొండ ఎంపీగా ఘన విజయం సాధించిన ఆయన తాజాగా ఎంపీగా ఎన్నికై దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి ఎల్లుండి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
చదవండి: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఎన్నిక…
సోమవారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. దీంతో హుజూర్ నగర్ కు బై ఎలక్షన్ జరగనుంది.
అయితే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ సతీమణి ఉత్తమ్ పద్మావతి బరిలోకి దిగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్థానాన్ని కాంగ్రెసే కైవసం చేసుకుంటుందా… లేక టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటుందా చూడాలి.
మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి… సతీమణిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అనుకుంటున్నా…. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి మరి.
చదవండి: సీఎం హోదాలో జగన్ చేసిన అతి పెద్ద తప్పు..!








