స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న కారు…

trs
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సత్తా చాటుతుంది. అన్ని జిల్లాల్లోనూ కారు దూసుకుపోతోంది. చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీయే మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను కైవసం చేసుకుంది. మొత్తం 5817 ఎంపీటీసీ స్థానాలకి గాను టీఆర్ఎస్ 3,100 స్థానాలు, కాంగ్రెస్ 1100, బీజేపీ 185 , ఇతరులు 518 స్థానాల్లో జయకేతనం ఎగరవేశారు. ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉన్నాయి.

ఇక 538 జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 56 , కాంగ్రెస్ 6 స్థానాల్లో గెల్చింది. పూర్తి ఫలితాలు సాయంత్రం వెలువడనున్నాయి.

ఇదిలా ఉంటే అన్నీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ డామినేట్ చేస్తుంటే జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ దూసుకెళుతోంది. జహీరాబాద్ మండలంలో కాంగ్రెస్‌ 7, టీఆర్‌ఎస్‌ 6 స్థానాల్లో విజయం సాధించింది. ముగుడంపల్లి మండలంలో కాంగ్రెస్‌ 5, టీఆర్‌ఎస్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి. ఝరాసంఘం మండలంలో కాంగ్రెస్‌ 8, టీఆర్‌ఎస్‌ 5 స్థానాల్లో విజయం సాధించగా.. కోహీర్‌ మండలంలో కాంగ్రెస్‌ 9, టీఆర్‌ఎస్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి.

చదవండి: చంద్రబాబుని విజయసాయి వదలట్లేదుగా…బాబుకి ప్రజల సొమ్ము అంటే చులకనా…!

- Advertisement -