మోడీ మాటలు నమ్మి పెద్ద నోట్ల రద్దుకు మద్దతిచ్చాం.. ఇప్పుడు చింతిస్తున్నాం: కేటీఆర్

telangana-minister-ktr-criticise-demonitisation-decision-taken-by-modi-govt
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ మాటలు నమ్మి అప్పట్లో నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చామని, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

చదవండి: రండి.. ప్రేమికుల దినోత్సవంలో పాల్గొనండి: ప్రధాని మోడీకి షహీన్‌బాగ్ నిరసనకారుల ఆహ్వానం!

జాతీయ టీవీ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన సదస్సులో ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అన్న అంశంపై మాట్లాడిన కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.

పెద్ద నోట్ల రద్దుకు తాము పూర్తిగా మద్దతు ఇచ్చామని, దానిపై అసెంబ్లీలోనూ చర్చించామన్నారు. ఈ విషయమై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిని కలిసి మాట్లాడారని కూడా ఆయన గుర్తు చేశారు.

‘ఆయన మాతో అలా చెప్పారు, కానీ..’’

తాము సంపూర్ణ క్రాంతి వైపు తీసుకెళ్తున్నట్టు ప్రధాని మోడీ తమకు చెప్పారని, ఆయన మాటలను నమ్మి నోట్ల రద్దుకు తాము మద్దతు పలికినట్టు చెప్పారు. అప్పుడు అలా మద్దతు పలికినందుకు ఇప్పుడు మరోమాటకు తావులేకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు.

చదవండి: దండం పెడతా.. మీ డబ్బు మీరు తీసుకోండి: భారత బ్యాంకులకు విజయ్ మాల్యా వేడుకోలు…

నాటి నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఆర్థిక అభివృద్ధికి విఘాతం కలిగించిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వృద్ధి రేటు నేడు 3-4 శాతం మధ్య కొట్టుమిట్టాడుతుండడానికి కారణం నాటి నోట్ల రద్దు నిర్ణయమేనని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.

‘‘ఆమె మాటలూ బాధించాయి..’’

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు రూ.1,58,735 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయని చెప్పారు. ఈ విషయంలో నిర్మలా సీతారామన్‌వి అబద్దాలు అన్నారు.

కేంద్రానికి గత అయిదేళ్లలో తెలంగాణ నుండి పన్ను ఆదాయంగా రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని, ఇందులో కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చింది కేవలం రూ.1.15 లక్షల కోట్లేనని కేటీఆర్ అన్నారు. మిగతా రూ.1.57 లక్షల కోట్లు ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు ఎక్కువ నిధులిచ్చామంటూ నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా చెప్పారని, ఇది తమకు బాధ కలిగించిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాల ఆర్థిక అవసరాల్ని తీర్చే బాధ్యతను కేంద్రం సమదృష్టితో నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన కేటీఆర్… జీఎస్టీ బకాయిల్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవలి బడ్జెట్ కూడా తెలంగాణను నిరాశపరిచిందన్నారు.

‘‘కేంద్రం పెద్దలు ఇది గుర్తుంచుకోవాలి..’’

భారత్ రాష్ట్రాల సమాఖ్య అని కేంద్రం పెద్దలు గుర్తుంచువాలని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఎన్ని విధానాలు తీసుకు వచ్చినా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వాటి ఆచరణ, అమలు అంతా రాష్ట్రాలోనే ఉంటుందని, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో కూడా రాష్ట్రాల కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం కూడా చాలా ఉంటుందనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించారు. 

- Advertisement -