
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నేడు కొత్తగా 52 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,813కు చేరుకుంది. తాజా కేసుల్లో 33 హైదరాబాద్ పరిధిలో నమోదు కావడం గమనార్హం.
అలాగే, వలస కార్మికుల్లో 19 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటి వరకూ మొత్తం 137 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.
కరోనాతో పోరాడుతూ నేడు ఒకరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 49కి పెరిగింది. మరోవైపు ఇవాళ ఒక్కరోజే 25 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటి వరకు 1068 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 696 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. హైదరాబాద్‌లో రోజుకు 30కు పైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. శుక్రవారం 42 కేసులు నమోదు కాగా, నేడు 33 నమోదయ్యాయి.








